Bhagavanth Kesari Thaman : 'భగవంత్ కేసరి' తో దసరా బరిలో దిగిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమా రిలీజై ఏడు రోజులు గడుస్తున్నా.. థియేటర్లు హౌస్‌ఫుల్ షోస్ రన్ అవుతున్నాయి. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. డైరెక్టర్ బాబీ 'భగవంత్ కేసరి' మూవీటీమ్ను రీసెంట్గా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. సినిమా దర్శకత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఏమన్నారంటే?
ప్రతి ఒక్కరు బీజీఎమ్ (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్), పాటలు.. సినిమాకు మైనస్ అయ్యాయని త్వరగానే ఓ అంచనాకు వచ్చేస్తుంటారని అన్నారు. దర్శకుడు సినిమాలో సన్నివేశాలు, కథలో ఎమోషన్స్ చక్కగా చూపించినప్పుడే మంచి సంగీతం అందించగలమని తమన్ తెలిపారు. కథలో ఎమోషన్స్ సన్నివేశాలు సరిగ్గా లేనప్పుడు, సంగీత దర్శకుడు ఫీల్‌గుడ్ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేయగలడని అన్నారు. " స్ట్రాంగ్ స్టోరీలైన్ లేని సీన్స్‌కు కూడా నేను మంచి మ్యూజిక్ అందించాను. సినిమా డైరెక్టర్ కథలో మంచి ఎమోషన్స్ సన్నివేశాలను జోడిస్తే.. మ్యూజిక్ ఆటోమేటిక్‌గా బాగా వస్తుంది. అచ్చం అలాగే దర్శకుడు అనిల్.. 'భగవంత్ కేసరి'కి మంచి కథ అందించాడు. అందుకే మ్యూజిక్, బీజీఎమ్ అంత బాగా వచ్చింది. అఖండ కూడా ఇలాగే సక్సెస్ అయ్యింది. ఒకవేళ కథలో బేస్ లేకుంటే, మ్యూజిక్ వర్కౌట్ కాదు" అని తమన్ అన్నారు.
తమన్ - బాలకృష్ణ కాంబినేషన్..మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. బాలయ్య సినిమాలకు వరుసగా మూడోసారి సంగీతం అందించారు. తమన్ ఇదివరకు.. అఖండ, వీరసింహరెడ్డి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అఖండ సినిమా బీజీఎమ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.