ప్రముఖ తమిళ నటుడు విజయ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. లోకేశ్ కనగరాజ్ యూనివర్స్(LCU)లో భాగంగా ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. 'విక్రమ్' సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేశ్.. ఇప్పుడు విజయ్ను డైరెక్ట్ చేయబోతున్నారు. 'దళపతి 67' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
లోకేశ్ తెరకెక్కించిన పాత చిత్రాల్లో ఉన్న క్యారెక్టర్లను.. తన ఎల్సీయూ చిత్రాల్లో ఆయన వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో కూడా హిట్ క్యారెక్టర్లను పెట్టబోతున్నట్టు సమాచారం. 'విక్రమ్' సినిమా చివర్లో 'రోలెక్స్' అనే పాత్రలో సూర్యను పరిచయం చేశారు లోకేశ్. అంతకముందు 'ఖైదీ' సినిమాలో 'ఢిల్లీ'గా కార్తీని పరిచయం చేశారు. అయితే ఈ పాత్రలు తన ఎల్సీయూ సినిమాల్లో వాడుకునేటట్లు రాసుకున్నారట.