ప్రముఖ తమిళ నటుడు విజయ్‌తో లోకేశ్ కనగరాజ్ యూనివర్స్(LCU)లో భాగంగా ఓ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. 'విక్రమ్' సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేశ్.. ఇప్పుడు విజయ్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 'దళపతి 67' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది 19 అక్టోబరు 2023న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కాగా, ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు 'లియో: బ్లడీ స్వీట్' నామకరణం చేశారు. అందులో భాగంగా ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు.
Thalapathy 67కు ఊహించని టైటిల్.. ప్రోమో అదిరిందిగా! - దళపతి విజయ్ లియో బ్లడీ స్వీట్ లోకేశ్ కనగరాజ్
ప్రముఖ తమిళ నటుడు విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో దళపతి67 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు అధికారిక పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే..
అయితే, విజయ్ అభిమానుల్లో చాలామంది.. ఈ సినిమాకు ఇదివరకే 'రెడ్ కోడ్' అనే పేరు పెట్టుంటారంటూ దానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు ఊహించని టైటిల్ పెట్టడం వల్ల సర్‌ప్రైజ్ అవుతున్నారు. కాగా, ఈ 'లియో: బ్లడీ స్వీట్'లో.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. తమిళ నటుడు విశాల్, దర్శకుడు గౌతమ్ మీనన్, మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. త్రిష ఫీమేల్ లీడ్‌లో నటిస్తున్నారు. ఖైదీ నటులు నరైన్, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.