Thalaivar 171 Cast : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుని దూసుకెళ్లింది. గతంలో వరుస ఫ్లాప్‌లను చవి చూసిన రజనీ ఈ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో తలైవర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'జైలర్' తర్వాత మరింత జోరు పెంచిన సూపర్ స్టార్.. గ్యాప్ ఇవ్వకుండా మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు. ఇటీవలే తన కుమార్తె దర్శకత్వంలో రూపొందిన 'లాల్ సలామ్' చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేసిన రజనీ.. వెనువెంటనే 'తలైవర్ 170' సినిమా షూటింగ్లో బిజీ అయిపోయారు. 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో పాటు భారీ తారాగణమే రంగంలోకి దిగనుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజూ వారియర్, దుషారా విజయన్ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించనున్నారు.
Jailer Movie Cast : అయితే 'జైలర్' సినిమాలో రజనీ యాక్షన్‌తో పాటు గెస్ట్ రోల్స్ కీలక పాత్రలు పోషించాయి. స్టోరీకి తగ్గట్టుగా పాత్రల చిత్రీకరణ కూడా ప్లస్ పాయింట్‌గా మారింది. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ అలా సినిమాలో ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తుంటే ఇక థియేటర్లలో ఈలలు గోలల మోతతో మెగింది. ముఖ్యంగా మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించడానికి ఈ ఫార్ములా హెల్ప్ అయ్యాయి. దీంతో రజనీ తన అప్‌కమింగ్ మూవీ కోసం ఈ ఫార్ములాను ఉపయోగించేందుకు ప్లాన్ చేశారు. అలా అటు నార్త్, ఇటు సౌత్ స్టార్స్‌ను ఈ 'తలైవర్ 170' ద్వారా రంగంలోకి దింపారు. ఇంతటి భారీ తారాగణంతో ఈ సినిమా అభిమానుల్లో ఓ రేంజ్లో అంచనాలు పెంచేసింది.
తాజాగా 'తలైవర్ 170' సినిమా షూటింగ్ మొదలైంది. దీంతో ఈ చిత్రంలోని స్టార్స్ అందరూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా రజనీతో బిగ్‌బీ అమితాబ్ కూడా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని రజనీ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు.''33 ఏళ్ళ తర్వాత నా మార్గదర్శి అమితాబ్ బచ్చన్ గారితో నటిస్తున్నాను. టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నాం. నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది'' అంటూ రజనీ ఎమోషనల్ అయ్యారు.