తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Thalaivar 170 Heroine : సూపర్ స్టార్ సినిమాలో 'గురు'బ్యూటీ.. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కన్ఫార్మ్ - ritika singh thalaivar 170

Thalaivar 170 Heroine : తమిళ్ సూపర్​స్టార్ రజనీకాంత్-టీజే జ్ఞానవేల్ కాంబినేషన్​లో తెరకెక్కున్న చిత్రం 'తలైవా 170'. అయితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించే కథానాయికల పేర్లను చిత్రబృందం సోమవారం ప్రకటించింది.

Thalaivar 170 Heroine
Thalaivar 170 Heroine

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 7:41 PM IST

Updated : Oct 2, 2023, 8:11 PM IST

Thalaivar 170 Heroine :తమిళ్ సూపర్​స్టార్ రజనీకాంత్.. 'జైభీమ్' ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'తలైవా 170' వర్కింగ్​ టైటిల్​తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై రూపొందనునుంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్న కథానాయికల వివరాలను మూవీయునిట్ తాజాగా ప్రకటించింది.

అయితే విక్టరి వెంకటేశ్ 'గురు' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి రితికా సింగ్.. ఈ చిత్రంలో కీ రోల్​ పోషించనుంది. రితికాతో పాటు మంజూ వారియర్‌, దుషారా విజయన్‌ కూడా ఈ ప్రాజెక్ట్​లో భాగమైనట్టు చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మరి ఎవరు ఏయే పాత్రల్లో మెరవనున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఎవరీ దుషారా, మంజూ వారియర్.. 2021లో విడుదలైన 'సార్పట్ట పంరంపరై' అనే తమిళ సినిమాలో హీరోయిన్​గా నటించిందీ భామ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా. రంజిత్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో దుషారా.. హీరో ఆర్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక మంజూ వారియర్.. కోలీవుడ్​లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.

ముగ్గురిలో ఎవరు?..సినిమాలో మరో కీలక పాత్రలో నటించేందుకు.. డైరెక్టర్ జ్ఞానవేల్, టాలీవుడ్ హీరో నానిని సంప్రదించారని టాక్ వినిపించింది. అయితే నాని ఇందుకు నో చెప్పారని.. ఆ స్థానంలో శర్వానంద్‌ని తీసుకునే ఛాన్స్​ ఉందని వార్తలొచ్చాయి. శర్వానంద్‌ కూడా సినిమాలో నటించేందుకు తిరస్కరించారని.. దీంతో ఆ అవకాశం దగ్గుబాటి రానాకు దక్కనుందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఈ విషయం గురించి మూవీటీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ ముగ్గురిలో ఎవరు రజనీకాంత్​తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

వీరితో పాటు సినిమాలో బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అలాగే మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కూడా కీలక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక 2024లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

Atlee Rajinikanth : రజనీ డూప్​గా రోబోలా కనిపించింది అట్లీనా?.. ఆయన కెరీర్​ ఎలా మొదలైందంటే?

Thalaivar 171 update : తలైవా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆ స్టార్ డైరెక్టర్​తో రజనీ మూవీ ఫిక్స్

Last Updated : Oct 2, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details