తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Thalaivar 170 Cast : మూవీ లవర్స్​కు డబుల్​ ట్రీట్​.. సూపర్ స్టార్​ సినిమాలోకి ఆ ఇద్దరి ఎంట్రీ.. - తలైవర్ 170 ప్రొడక్షన్ హౌస్​

Thalaivar 170 Cast : సూపర్ స్టార్ రజనీకాంత్​- 'జై భీమ్' ఫేమ్​ దర్శకుడు టి.జి జ్ఞానవేల్‌ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'తలైవర్​ 170'. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్​ కనిపించి సందడి చేయనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్​లోకి రానా, ఫహాద్​ చేరుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

Thalaivar 170 Cast
Thalaivar 170 Cast

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 4:21 PM IST

Updated : Oct 3, 2023, 5:45 PM IST

Thalaivar 170 Cast :సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన అప్​కమింగ్ మూవీపై దృష్టి సారిస్తున్నారు. 'జై భీమ్​' ఫేమ్ టి.జి జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు ఇటీవలే రజనీ సైన్​ చేశారు. 'తలైవర్​ 170' అనే వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్​ బ్యానర్​పై తెరకెక్కుతన్న ఈ భారీ బడ్జెట్​ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది.

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న స్టార్స్​ పేర్లు చెబుతూ ఓ స్పెషల్​ పోస్టర్లను రిలీజ్​ చేసింది. కథానాయికలు మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌లు ఇందులో నటిస్తున్నట్లు చిత్రబృందం సోమవారం తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ బజ్​కు మూవీటీమ్ ఇప్పుడు ఫుల్​స్టాప్​ పెట్టింది.

టాలీవుడ్​ స్టార్ హీరో రానా దగ్గుబాటికూడా ఈ సినిమాలో కీలక రోల్​ ప్లే చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్​లో తెలిపింది. ఇక రానాతో పాటు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్​ ఫాజిల్​ కూడా నటించనున్నారని చిత్రబృందం పేర్కొంది. ఇలా మూవీకి సంబంధించిన వరుస అప్‌డేట్‌లు రిలీజౌతున్న సందర్భంగా రజనీ ఫ్యాన్స్​లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

రానాకు ముందు ఆ ఇద్దరు..
Rana Thalaivar 170 :అయితే రానాను కన్ఫామ్​ చేసే ముందు ఈ రోల్​కు టాలీవుడ్ హీరో నానిని సంప్రదించారని టాక్ వినిపించింది. అయితే నాని ఇందుకు నో చెప్పారని.. ఆ స్థానంలో శర్వానంద్‌ని తీసుకునే ఛాన్స్​ ఉందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత శర్వానంద్‌ కూడా సినిమాలో నటించేందుకు తిరస్కరించారని.. దీంతో ఆ అవకాశం దగ్గుబాటి రానాకు దక్కనుందని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఈ ట్వీట్​తో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

వీరితో పాటు సినిమాలో బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. 2024లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది.

Rajinikanth Meets Yogi Adityanath : యోగిని కలిసిన సూపర్​స్టార్.. నేడు అయోధ్య రామయ్య దర్శనానికి రజనీ

Jailer Ott Release Date : 'జైలర్' ఓటీటీ కోసం రజనీ ఫ్యాన్స్ నిరీక్షణ.. రిలీజ్ అయ్యేది అప్పుడే!

Last Updated : Oct 3, 2023, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details