Telugu Upcoming Movies :సినిమాలకు సముద్రాలకు మంచి అనుబంధం ఉంటుంది. ప్రేమకథలు, పోరాట కథలతో బీభత్సం సృష్టించాలన్నా.. దర్శక నిర్మాతల మొదటి ఎంపిక సముద్ర తీరం. వీలైతే అందుబాటులో ఉన్న విశాఖ, కాకినాడ లేదా ముంబయి, గోవా, కోల్‌కతా తీరాల వైపు ఓ లుక్కేస్తారు. ఇక కథతో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా.. స్క్రీన్ అట్రాక్షన్ కోసంమో, పాట కోసమె, యాక్షన్ సన్నివేశం కోసమో సముద్ర సముద్ర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతుంటారు మన దర్శకులు. అయితే ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలు.. పూర్తిగా సముద్ర ప్రాతం నేపథ్యంలో సాగే సినిమాలతో ముందుకు వస్తున్నారు. వారెవరు? ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవర..
జూ. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ఇండియా స్టార్‌గా ఎదిగారు. అయితే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ కథ పూర్తిగా తీర ప్రాంత నేపథ్యంలో సాగుతుంది. భయంకరమైన మృగాలకు భయాన్ని పరిచయం చేసేందుకు హీరో ఏం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ క్రమంలో దర్శకుడు.. సముద్రానికి, దాని నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తారక్‌తో నీటి లోపలో సీన్స్ ఉండనున్నాయట. ఈ యాక్షన్ సీక్వెల్స్ కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానుంది.
ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)'. అయితే ఈ కథ ముంబయి పోర్టు కేంద్రంగా సాగనుంది. సినిమాలో పవన్.. పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనున్నారు. ఇక పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.