Telugu Sequel Movies : ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఏదైన సినిమా భారీ హిట్ సాధిస్తే వాటికి కొనసాగింపుగా స్వీక్వెల్స్ తెరకెక్కించే ప్లాన్స్ చేస్తున్నాయి ఆయా చిత్రబృందాలు. సక్సెస్ సాధించిన సినిమాకు సీక్వెల్ రూపొందించడం వల్ల కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తొలి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు, సీక్వెల్ వస్తుందంటే అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయిుతే టాలీవుడ్ లో వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు పలు సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
Pushpa The Rule : సీక్వెల్స్ వరుసలో ముందుగా చెప్పుకోవాల్సింది ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది. 'పుష్ప-1' సూపర్ హిట్ కావటం వల్ల ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు- 2'. కమల్‌హాసన్, అజయ్ దేవ్గన్ లాంటి పెద్ద స్టార్లు నటిస్తుండం వల్ల ఈ సినిమా మీద కూడా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఎప్పుడేప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Kantara Prequel :ఆ తర్వాత రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాంతారా-2'. అయితే ఈ సినిమా సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అంటే ఇటీవల రిలీజైన 'కాంతారా'కు ముందు ఏం జరిగిందనేది ఈ ప్రీక్వెల్‌లో చూపబోతున్నారు రిషబ్ శెట్టి. రీసెంట్గా విడుదలైన వీడియో గ్లింప్స్‌కు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.