తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Telugu Movies Release In 2024 January : సంక్రాంతి బరిలో పందెం కోళ్లళ్లా 'సినిమాల క్యూ'.. విన్నర్ ఎవరో? - సంక్రాంతి కానుకగా రానున్న తెలుగు సినిమాలు

Telugu Movies Release In 2024 January : టాలీవుడ్​లో పలు పెద్ద సినిమాల నిర్మాతలతో పాటు చిన్న సినిమాల ప్రొడ్యూసర్​లు కూడా సంక్రాంతికి తమ మూవీలను రిలీజ్​ చేసేందుకు అప్పుడే కర్చీఫ్​ వేసేశారు. ఇప్పటికే కొందరు బడా హీరోల సినిమాలు పొంగల్​ బరిలో దిగేందుకు షెడ్యుల్​ను​ రెడీ చేసుకుంటే మరి కొందరేమో తాము కూడా తగ్గేదే లేదంటూ ఒక్కొక్కరుగా భోగి పండగ నాడే తామూ ప్రేక్షకుల ముందుకు వస్తామని అనౌన్స్​ చేస్తున్నారు. మరి ఒకే పండుగకు ఇలా థియేటర్ల ముందు క్యూ కడుతున్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం.

Telugu Movies Release Dates In January 2024
Sankranthi Telugu Movies Release Dates

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 6:41 PM IST

Telugu Movies Release In 2024 January : సంక్రాంతి.. తెలుగువారికి అత్యంత హుషారు తెప్పించే పండగల్లో ఒకటి. అయితే ఈ పండుగ మన తెలుగు వారికి కాస్త సెంటిమెంట్ అనే చెప్పాలి​. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి. ఎందుకంటే ఈ టైమ్​లో రిలీజ్​ అయ్యే సినిమాలు బ్లాక్​బస్టర్​ హిట్స్​ సాధిస్తాయని ఓ చిన్న నమ్మకం. ఇదిలా ఉంటే టాలీవుడ్​లో కొందరు నిర్మాతలు రానున్న సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్​ చేసేందుకు అప్పుడే కర్చీఫ్​ కూడా పేసేసుకున్నారు. కాగా, కొన్ని బడా సినిమాలు పొంగల్​ రేసులో పోటీపడేందుకు డేట్స్​ను కూడా ఫిక్స్​ చేసుకుంటే మరి కొందరు మూవీ ప్రొడ్యూసర్సేమో ఒక్కొక్కరుగా తాజాగా తాము కూడా భోగి పండగ బరిలో పోటీ పడతామని ముందుకు వస్తున్నారు. మరి మేమూ తగ్గేదేలే అంటూ వస్తున్న ఆ సినిమాల లిస్ట్​పై ఓ లుక్కేద్దాం.

VD13!
ఇప్పటిదాకా కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పిన సినిమాల్లో 'విజయ్ దేవరకొండ-13'(VD13) ఒకటి. ఈ సినిమాను పరశురామ్‌ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఆడియెన్స్​ ముందుకు ఎలాగైనా తేనున్నట్లు నిర్మాత దిల్​రాజు ఇప్పటికే అనౌన్స్​ చేశారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రీ-లుక్​ రూపంలో ఉన్న పోస్టర్​ను కూడా రిలీజ్​ చేశారు.

గుంటూరు కారం!
త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బడా సినిమా 'గుంటూరు కారం'. ఇందులో సూపర్​స్టార్​ మహేశ్​ బాబు లీడ్​ రోల్​లో నటిస్తున్నారు. దీన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేసేందుకు ప్లాన్​ చేశారు మూవీ మేకర్స్. హారిక హాసిని క్రియేషన్స్​ భాగస్వామ్యంతో సితార అధినేత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈగల్!
డైరెక్టర్​ కార్తీక్​ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్​మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'ఈగల్'. ఈ సినిమా కూడా 2024 సంక్రాంతి బరిలో ఉంది. పండగ కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తేనుంది మూవీ టీమ్​.

హనుమాన్!
తన మూడేళ్ల వయసులోనే చూడాలని ఉంది సినిమాతో బాల నటుడిగా తెరంగేట్రం చేసి హీరోగా రాణిస్తున్న నటుడు తేజ సజ్జా. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్​ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'హనుమాన్​'తో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమాను 11 భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

నా సామిరంగ!
ఆగస్టు 29 తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేశారు హీరో అక్కినేని నాగార్జున. అదే 'నా సామిరంగ'. ఇక ఈ సినిమాను కూడా సంక్రాంతి గిఫ్ట్​గా ఆడియెన్స్​​ ముందుకు తెస్తున్నారు.

కల్కి!
ప్రభాస్​ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్​ చిత్రం 'కల్కి'. ఈ సినిమా కూడా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

డార్లింగ్​ వస్తే ఏంటి పరిస్థితి?
రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా నటిస్తున్న 'సలార్' మూవీ కూడా పోస్ట్​పోన్​ అయింది. దీనిని ఈ ఏడాది చివర్లో తేస్తామని చెప్పడం వల్ల పెద్దగా టెన్షన్​ పడాల్సిన పనిలేదు. అయితే ఈ తేదీ కూడా ముందుకు జరిగి సంక్రాంతి ఖాతాలోకి వెళ్తే మాత్రం బరిలో మరో పెద్ద సినిమా పోటీలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.

September Last Week Movie Release : బాక్సాఫీస్ వద్ద వీకెండ్ సందడి.. సినీ లవర్స్​కు ఎంటర్​టైన్​మెంట్​ పక్కా!

2024 Sankranthi Movies : ఆసక్తికరంగా 'సలార్​' రిలీజ్.. సంక్రాంతే టార్గెట్​గా ఈ టాప్​ హీరోల సినిమాలు..

ABOUT THE AUTHOR

...view details