తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మల్టీప్లెక్స్‌ల్లో తినుబండారాల ధరలు తగ్గించండి' - pvr popcorn price

మల్టీప్లెక్స్​లో తినుబండారాల ధరలను తగ్గించాలని సూచించింది తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​. తినుబండారాల క్వాంటిటీని కూడా తగ్గిస్తే ప్రేక్షకుడు ఖర్చును భారంగా భావించరనే విషయాన్ని వివరించింది. ఫిల్మ్ ఛాంబర్ సూచనలపై స్పందించిన ఆయా మల్టీప్లెక్స్‌ థియేటర్ల ప్రతినిధులు.. తినుబండారాల ధరల తగ్గింపు విషయంపై సానుకూలత వ్యక్తం చేశారు.

మల్టీఫ్లెక్స్‌
మల్టీఫ్లెక్స్‌

By

Published : Aug 4, 2022, 10:56 PM IST

మల్టీప్లెక్స్‌ థియేటర్లలో దోపిడికి గురవుతున్నామనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో నుంచి దూరం చేసేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్, ఏషియన్ లాంటి మల్టీప్లెక్స్‌ సంస్థల జాతీయ ప్రతినిధులతో ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులు, థియేటర్ వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే మల్టీప్లెక్స్‌లో విక్రయించే టికెట్ ధరలతోపాటు తినుబండారాల ధరల తగ్గింపుపై సమాలోచనలు జరిపారు. తినుబండారాల విషయంలో ప్రేక్షకులు భారంగా భావిస్తున్నారని, ఆ ధరలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ మల్టీప్లెక్స్‌ ప్రతినిధులకు సూచించింది. అలాగే తినుబండారాల పరిమాణాన్ని (క్వాంటిటీ) కూడా తగ్గిస్తే ప్రేక్షకుడు ఖర్చును భారంగా భావించరనే విషయాన్ని వివరించింది.

ఫిల్మ్ ఛాంబర్ సూచనలపై స్పందించిన ఆయా మల్టీప్లెక్స్‌ థియేటర్ల ప్రతినిధులు.. తినుబండారాల ధరల తగ్గింపు విషయంపై సానుకూలత వ్యక్తం చేశారు. తమ యాజమాన్యాలతో చర్చించి ప్రేక్షకులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అలాగే నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే సాధ్యమైనంత వరకూ అమలు చేసేలా చూస్తామన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విదేశాల తరహాలో ఆన్​లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు సాధ్యాసాధ్యాలపై కూడా ఫిల్మ్ ఛాంబర్ తో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 10న మరోసారి సమావేశమై మల్టీప్లెక్స్‌లో తినుబండారాల ధరల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :'మరో పది రోజుల్లో ప్రాబ్లమ్స్ క్లియర్​​.. కాస్త వెయిట్​ చేయండి!'

ABOUT THE AUTHOR

...view details