కేజీఎఫ్.. ఓ సాధారణ చిత్రంగా విడుదలై బాక్సాఫీసును ఊపేసింది. హీరో యశ్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు సాధించిపెట్టింది. ఇక కేజీఎఫ్ 2 అంతకుమించి హిట్ అవ్వడం వల్ల పాన్ ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియులకు అభిమాన హీరో అయ్యాడు యశ్. కాగా, ఈ సినిమా మూడో పార్ట్‌కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి నెట్టిల్లు కోడై కూస్తోంది. ఇటీవలే టీమ్ఇండియా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్య.. యశ్‌ను కలిసి దిగిన ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వీరితో పాటు హార్దిక్ సోదరుడు.. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ కృనాల్ పాండ్యతో కలిసి ఫొటో దిగాడు యశ్. ఈ ఫొటోలను హార్టిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పాటు పోస్టు కింద 'కేజీఎఫ్ 3' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
కేజీఎఫ్ హీరోను కలిసిన టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్.. కారణం ఇదేనా? - యశ్‌ను కలిసిన హార్దిక్ పాండ్య
కేజీఎఫ్ హీరో యశ్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య.. యశ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే కేజీఎఫ్-3లో హార్దిక్ ఏమైనా రోల్ చేస్తున్నాడా అనే చర్చ నడుస్తోంది.
ఇక ఈ పోస్ట్‌కు లక్షల్లో లైక్‌లు కొట్టడం అభిమానుల వంతైంది. కామెంట్ సెక్షన్లో.. సినిమా, క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఓ కింగ్ మరో కింగ్‌ను మీట్ అయ్యాడని ఓ నెటిజన్ కామెంట్ పెడితే.. కేజీఎఫ్ 3లో హార్దిక్ ఏమైనా రోల్ ఉంది కావచ్చు అని మరో అభిమాని సరదాగా రాసుకొచ్చాడు. కాగా, పాన్ ఇండియా స్టార్ యశ్.. కేజీఎఫ్ 3 కాకుండా మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా యష్ 19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో యశ్‌కు జోడీగా పూజా హెగ్డే ఆడిపాడనుందని తెలుస్తోంది. కానీ ఈ వార్తలకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు. కాగా, జనవరి 8న యశ్ తన బర్త్‌డే జరుపుకోనున్నాడు. ఆ రోజు యష్ కొత్త చిత్రం గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.