Vijaydevarkonda injured: 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. మరోవైపు నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'విజయ్ దేవరకొండతో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నాకు వరుసగా మూడు ఫ్లాప్‌లు వచ్చాక విజయ్ దేవరకొండను వైల్డ్ కార్డ్‌లా వాడతా" అని అన్నారు.
బ్రేక్స్ ఫెయిల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న విజయ్! - ట్రక్కు బ్రేకులు ఫెయిల్ విజయ్ దేవరకొండ
Tarun Bhaskar Vijaydevarkonda: 'పెళ్లి చూపులు' సినిమా షూటింగ్ సమయంలో తాను, విజయ్ దేవరకొండ ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. కానీ ఆ సమయంలో విజయ్ చెప్పిన సమాధానం విని తాను షాక్ అయినట్లు చెప్పారు.
దీంతో పాటు 'పెళ్లి చూపులు' సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. "ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వగానే అప్పటివరకు భయపడ్డ విజయ్ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. ప్రియదర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్న దానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్‌గా ఉన్నావని అడిగితే.. 'మొదట భయమేసింది, కానీ తర్వాత అందరం చచ్చిపోతాం కదా, ఏముంది' అని సమాధానం చెప్పడంతో షాకయ్య." అని అన్నారు తరుణ్ భాస్కర్.
ఇదీ చూడండి: కొడుకు అకీరా కోసం కలిసిన పవన్‌కల్యాణ్-రేణుదేశాయ్!