Tapsee Shabhash Mithu Release Date: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా 'శభాష్ మిథు'. తాప్సీ ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించారు. జులై 15న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ఒక రోజు ముందే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'ది వారియర్' చిత్రం విడుదల కానుంది. ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. మరి రామ్‌తో పోటీని తట్టుకుని తాప్సీ నిలుస్తుందా లేదా చూడాలి.
Family Man season 3 update: 'ది ఫ్యామిలీ మ్యాన్'.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఈ వెబ్ సిరీస్‌కు నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు దుమ్మురేపాయి. తాజాగా.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి ఓ వార్త బయటకొచ్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ న్యూ సీజన్' అంటూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అమెజాన్ ప్రైమ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 'చెల్లం సర్కి కాల్ చెయ్.. ఈ వార్త నిజమేనని ఆయన చెబుతారు,' అంటూ ఇంగ్లీష్‌లో క్యాప్షన్ ఇచ్చారు. దీతో ఈ వెబ్ సిరీస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.