ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది లేకుండా ఏ పని జరగదు. ముఖ్యంగా సెలబ్రిటీలకైతే ఇది మరింత ముఖ్యమనే చెప్పాలి. వీటి ద్వారానే సోషల్‌మీడియా అంటూ ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వారికి దగ్గరవుతుంటారు. అయితే ఇంకా ఫోన్ వాడని స్టార్స్ ఉన్నారా అంటే? అవుననే చెప్పాలి. తమిళ స్టార్ హీరో అజిత్ ఈ జాబితాలోకే వస్తారు.
అసలు విషయానికొస్తే.. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు ఈ తమిళ స్టార్‌ను ముద్దుగా 'తల' అని పిలుస్తారు. మల్టీటాలెంటెడ్ అయిన ఈ హీరో బయట కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. అంతే కాకుండా ఎటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ సైతం లేవు. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే ఈ హీరో సినిమా ఫంక్షన్లలకు సైతం తక్కువగానే హాజరవుతుంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి అంతగా చెప్పుకోని ఈ స్టార్ గురించి తాజాగా తన కో స్టార్ త్రిష ఓ సీక్రెట్ రివీల్ చేశారు. అదేందంటే.. ఆయన ఫోన్ వాడరట. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన త్రిషతో ముచ్చటించిన యాంకర్.. 'అజిత్ నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేశార'ని అడగగా.. ఈ విషయాన్ని చెప్పింది.
అజిత్‌తో ఎప్పుడూ ఓ మేనేజర్ ఉంటారట. ఆయనే అజిత్‌కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటారట. అజిత్ ఎవరితోనైనా మాట్లాడాలన్నా, లేదా అజిత్‌తో ఎవరైనా మాట్లాడాలనుకున్న ఈయనే చూసుకుంటారట. అందుకే తల ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ ఉపయోగించరట. మరో విషయం ఏంటంటే.. అజిత్ నటించే ప్రతి చిత్రానికి ఓ కొత్త సిమ్ కార్డ్‌ని తీసుకుంటారట. ఆ సినిమా విడుదలయ్యాక.. మరో కొత్త ప్రాజెక్ట్ మొదలవ్వగానే సిమ్ కార్డ్‌ను మార్చేస్తారట. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు ఆయన దృష్టంతా కేవలం పనిపైనే ఉంటుందని, వేరే విషయాల గురించి పట్టించుకోరని తెలిసింది. దీనివల్ల అనవసరమైన ఫోన్ కాల్స్‌ను ఎత్తాల్సిన అవసరం ఉండదని అలా చేస్తారట.
ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తోన్న ఆయన ఈ సంక్రాంతికి యాక్షన్ థ్రిల్లర్ 'తునివు'తో ప్రేక్షకుల మందుకు రానున్నారు. తెలుగులో 'తెగింపు' పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలై ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. మంజు వారియర్ కథానాయిక. రానున్న సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారిసు సినిమాల సరసన ఈ చిత్రం విడుదలవ్వనుంది.
ఇదీ చూడండి:ట్యూన్ కోసం DSP కష్టం.. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రయోగం.. చివరకు..