తమిళ సీరియల్ నటుడు భరత్ కల్యాణ్ భార్య ప్రియ సోమవారం కన్నుమూశారు. ఆమె మృతిపట్ల తమిళ బుల్లి తెర నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఓ డైట్ పాటించడం వల్లే మరణించారని వైద్యులు తెలిపారు.
43 ఏళ్ల ప్రియ మధుమేహంతో బాధ పడుతుండేవారు. చికిత్సలో భాగంగా బరువు తగ్గేందుకు ఆమె పాలియో అనే డైట్‌ను పాటించారు. దాని వల్ల క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మూడు నెలలుగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే కోమాలోకి వెళ్లిపోయిన ప్రియ సోమవారం కన్నుమూశారు. ఫలితంగా ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల భరత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది తమిళ సీరియల్ ఇండస్ట్రీ.
సినిమా, సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్న భరత్.. తమిళంలో జెంటిల్‌మన్, ఆదిలక్ష్మీ పురాణం వంటి చిత్రాల్లోనూ నటించారు. భరత్ ప్రస్తుతం ప్రైవేట్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'భారతి కన్నమ్మ' అనే సీరియల్‌లో నటిస్తున్నారు. దిగ్గజ నటుడు కల్యాణ్ కుమార్ కుమారుడు భరత్.