తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాట్ టాపిక్​గా కార్తి రెమ్యునరేషన్​.. మీడియాలో జోరుగా చర్చ! - హీరో కార్తిపై తమిళ మీడియా ప్రచారం

తాజాగా రిలీజైన 'సర్దార్​' సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్​ అందుకుంది. అయితే హీరో కార్తి గురించి తమిళ మీడియాలో ఒకటే చర్చ..అసలు దేని గురించి..

tamil media about  hero kathi
తమిళ మీడియాలో హీరో కార్తి

By

Published : Oct 27, 2022, 10:12 PM IST

Updated : Oct 27, 2022, 10:48 PM IST

అటు తమిళంలో..​ ఇటు తెలుగు సినిమాల్లో.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తి. పాన్​ ఇండియా చిత్రంగా తెరకెక్కిన 'పొన్నియన్​ సెల్వన్​' మంచి హిట్టు కొట్టింది. దాంతో పాటు తాజాగా పి.ఎస్​ మిత్రన్​ దర్శకత్వంలో రిలీజైన 'సర్దార్​' సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కార్తి విభిన్నమైన పాత్రలు పోషించి తనను తాను కొత్తగా చూపించుకున్నాడు.

అయితే ఇప్పటికే ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు హీరో కార్తి. వరుస విజయాలతో మంచి ఫామ్​లో ఉన్న కార్తి.. తన రాబోయే సినిమాలకి భారీగా రెమ్యునరేషన్​ అడుగుతున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి సమాచారం రాలేదు. మరోవైపు ప్రేక్షకులను అలరించేందుకు భారీ స్థాయిలో రూపొందుతున్న ఓ యాక్షన్​ డ్రామాలో కార్తి నటిస్తున్నట్లు సమాచారం.

Last Updated : Oct 27, 2022, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details