Vijay Meets Fans : దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తన అభిమానుల్ని కలిశారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. చెన్నైలోని పనైయూర్‌లోని 'విజయ్ మక్కల్ ఇయక్కం' కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌ని కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.
5ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌ను కలిసిన విజయ్.. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండంటూ.. - సంక్రాంతి బరిలో వారిసు
Vijay Meets Fans : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన అభిమానులతో సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌ను కలవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిమానులకు సూచించారు.
"కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం చేసి సంపాదించండి. మీ సంపాదనలో 2 శాతం ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి" అని అభిమానుల్ని ఉద్దేశించి విజయ్ ప్రసంగించారు. అనంతరం పలువురు అభిమానులతో ఫొటోలు దిగారు. తనని కలిసేందుకు వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ సిద్ధం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విజయ్ నటిస్తోన్న 'వారిసు' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
విజయ్ తన అభిమానులతో ప్రతి ఏటా సమావేశమయ్యేవారు. అయితే, కరోనా, ఇతర కారణాల వల్ల దాదాపు ఐదేళ్ల నుంచి ఫ్యాన్స్ మీట్ నిర్వహించలేదు. దీంతో ఆదివారం జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్ మక్కల్ ఇయక్కంలో సభ్యులైన వారికి మాత్రమే ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్లు సమాచారం.