Lust Stories 2 Review : 'లస్ట్ స్టోరీస్'.. 2018లో విడుదలైన ఈ ఆంథాలజీ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిన ఆంథాలజీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2'. మిల్కీ బ్యూటీ తమన్నా, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, సీనియర్ హీరోయిన్ కాజోల్ వంటి వారు నటించడం, అలాగే ప్రచార చిత్రాలు ఆకర్షించేలా ఉండటం వల్ల.. సినీ ప్రియులకు సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సిరీస్ గురువారం(జూన్ 29) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందంటే?
ముచ్చటైన జంట, అద్దం, మాజీ ప్రేయసితో శృంగారం, బొద్దింక అనే నాలుగు ఎపిసోడ్లతో ఈ రెండో సీజన్‌ను రూపొందించారు. వాటి కథేంటంటే..
మొదటి ఎపిసోడ్.. వేద (మృణాల్ ఠాకూర్) అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే వేద బామ్మ (నీనా గుప్త) మధ్యలో ఎంట్రీ ఇచ్చి.. కొత్త జంట లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని అడ్వైస్ ఇస్తుంది. ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉంటారా? లేదా? అన్నది ఈ అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటుంది. మరి బామ్మ చెప్పిన మాటలను వేద, అర్జున్ విన్నారా? ఈ జంటకు చెందిన ఇరు కుటుంబాలు బామ్మ మాటను అంగీకరించారా? చివరిగా వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది మిగతా కథ.
రెండో ఎపిసోడ్.. ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒక రోజు మైగ్రేన్ కారణంగా తీవ్రమైన తలనొప్పి రావడం వల్ల కాస్త ముందుగానే ఇంటికి చేరుకుంటుంది. అదే సమయంలో ఇంటి పనిమనిషితో తన భర్తతో కలిసి శృంగారం చేస్తుండగా చూసి షాక్ అవుతుంది. మరి ఆ తర్వాత ఇషిత ఏం చేసిందనేదే మిగతా కథ.
మూడో ఎపిసోడ్.. విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ) అమ్మాయిల పిచ్చి. అనిత (ముక్తి మోహన్)ను పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు . ఒక రోజు అతడికి తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య సెక్స్ జరుగుతుంది. మరి ఆ తర్వాత శాంతితో అతడు ఎలా విడిపోయాడు అనేదే కథ.