అగ్ర కథానాయిక తమన్న టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో.. సినీనటి తమన్నా బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు.
విలేకరులపై తమన్నా బౌన్సర్ల దాడి.. ఇద్దరికి గాయాలు - మీడియా ప్రతినిధులపై సినీనటి తమన్నా బౌన్సర్ల దాడి
మీడియా ప్రతినిధులపై సినీనటి తమన్నా బౌన్సర్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లు గాయపడ్డారు.
విలేకరులపై తమన్న బౌన్సర్ల దాడి
ప్రెస్ మీట్ ముగిశాక.. మీడియా ప్రతినిధులు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తమన్నా బౌన్సర్లు.. మీడియా ప్రతినిధులు వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. జరిగిన దానికి చింతిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి:ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి అనౌన్స్మెంట్..!
Last Updated : Sep 17, 2022, 4:02 PM IST