తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇన్​స్టాలో భర్తను పరిచయం చేసిన మిల్కీబ్యూటీ తమన్నా! - చిరంజీవితో తమన్నా కొత్త సినిమా

తన అందం, అభినయంతో కుర్రకారును హీటెక్కిస్తుంది మిల్కీబ్యూటీ తమన్నా. అయితే తాజాగా తన భర్త ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. అదేంటి? తమన్నాకు ఇంకా పెళ్లి అవ్వలేదుగా అని మీ డౌటా? అయితే ఆ ఫొటోపై క్లారిటీ కావాలంటే ఈ వార్త చదివేయండి.

tamannaah
తమన్నా

By

Published : Nov 17, 2022, 9:50 AM IST

హెడ్‌లైన్‌ చూడగానే 'ఏంటీ తమన్నాకు పెళ్లయిందా?'.. అనే సందేహం కలిగిందా? ఆమెకు వివాహంకాలేదు కానీ భర్తను మాత్రం పరిచయం చేసింది. ఇప్పుడు మరో అనుమానం వచ్చిందా? ఇన్ని ట్విస్ట్‌లెందుకు అసలు సంగతి చెప్పమంటారా.. 'ఫలానా నటి ఫలానా హీరోతో డేటింగ్‌ చేస్తోందట', 'ఆ హీరోయిన్‌ విదేశీయుడిని వివాహమాడనుందట' అంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో వదంతులు వస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఈ జాబితాలో కొందరు తమన్నానూ చేర్చారు.

'మిల్కీబ్యూటీ తమన్నా ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలోనే ఏడడుగులు వేయబోతోంది' అంటూ కథనాలు అల్లారు. అక్కడితో ఆగకుండా.. ఆమె ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం పెళ్లేనని ఫిక్స్‌ అయిపోయారు. ఈ వార్తలు అభిమానులకే కాదు తమన్నా వద్దకూ చేరినట్టున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన మ్యారేజ్‌ గురించి జోస్యం చెప్పిన వారందరికీ గట్టి కౌంటర్‌ ఇచ్చిందీ బ్యూటీ.

'ఇతనే నా భర్త (వ్యాపారవేత్త)' అంటూ తాను ఇటీవల నటించిన 'ఎఫ్‌ 3' సినిమాలోని పాత్రకు సంబంధించిన క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేసింది. 'మ్యారేజ్‌ రూమర్స్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేసింది. ఆ చిత్రంలో తమన్నా కొన్ని సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించింది. ఆ దృశ్యాలనే ఆమె పంచుకుంది. ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన తమన్నా ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. సత్యదేవ్‌ సరసన నటించిన 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితోపాటు ఆమె డైరీలో హిందీ, మలయాళ సినిమాలున్నాయి.

తమన్నా

ఇదీ చదవండి:బాధలోనూ ఫ్యాన్స్​పై ప్రేమ చూపించిన మహేశ్‌

సన్నీ లియోనీకి హైకోర్టులో ఊరట.. 'కాంట్రాక్ట్​' కేసుపై స్టే

ABOUT THE AUTHOR

...view details