హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార తరచూ తన పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది స్వరా భాస్కర్. ప్రముఖ పొలిటికల్ లీడర్ ఫహద్ అహ్మద్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది.
ఫస్ట్ నైట్ బెడ్ ఫొటో షేర్ చేసి షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజన్లు ఫుల్ ఫైర్! - స్వరా భాస్కర్ ట్విట్టర్
ప్రముఖ రాజకీయ నాయకుడితో ఇటీవలే వివాహం బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్.. తాజా ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. హనీమూన్ బెడ్‌ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఇటీవలే కోర్టులో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫహద్‌ను వివాహం చేసుకుంది స్వర. తాజాగా తమ ఫస్ట్ నైట్ బెడ్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. హనీమూన్ బెడ్‌ను తన తల్లి గులాబీలతో అలంకరించిందంటూ ఆ పోస్టును ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సందర్భంగా తమ లవ్‌స్టోరీ ఎలా మొదలైందో చెబుతూ ఒక వీడియోను షేర్ చేసింది.
"మేం ప్రేమ కోసం ఎదురుచూశాం. కానీ, ముందుగా స్నేహాన్ని కనుగొన్నాం. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. నా గుండె చప్పుడు ఫహద్ జిరార్ అహ్మద్‌కు స్వాగతం" అని ఈ సందర్భంగా తమ పడకగది ఫొటోలను పంచుకుంది స్వర. దీంతో ఈ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు స్వర- ఫహద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఫొటోలు షేర్ చేయాలో కూడా తెలియదా అంటూ బాలీవుడ్ నటిపై మండిపడుతున్నారు. బెడ్ రూమ్ రహస్యాలు బయట పెడితే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.