Lalitmodi sushmitha sen breakup: తామిద్దరం ప్రేమలో ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెబుతూ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కొంతకాలం కిందట ప్రకటించి అందరికీ షాకిచ్చారు. సుస్మితతో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలను లలిత్ ఈ ఏడాది జులైలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుస్మితతో డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే వివాహ బంధంలోకి కూడా వస్తామని ట్వీట్ చేశారు.
అయితే, వయసులో చాలా తేడా ఉన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడటంపై అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఇద్దరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయిందట. తాజాగా ఈ ఇద్దరూ విడిపోయారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల, లలిత్ మోదీ తన ఇన్ స్టాగ్రామ్లో డిస్ ప్లే పిక్చర్, బయోలో సుస్మిత ఫొటో, ఆమె ప్రస్తావనను తీసేయడంతో వీళ్లు బ్రేకప్ అయ్యారన్న పుకార్లకు బలం చేకూరుతోంది.