తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరో క్యామియోలో 'రోలెక్స్​ సార్​'.. ఎందులో అంటే?

కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య ఇటీవల 'విక్రమ్'​ సినిమాలో రోలెక్స్​గా అదరగొట్టి అభిమానులకు ఫుల్​మీల్స్​ పెట్టేశారు. ఇప్పుడు మరోసారి సూర్య క్యామియో చేయనున్నారు. మరి ఈసారి ఎలాంటి పాత్ర చేయనున్నారో తెలుసా?

d
d

By

Published : Jun 15, 2022, 10:43 PM IST

యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్​ హీరోగా నటించిన విక్రమ్​ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇందులో క్లైమాక్స్​లో రోలెక్స్​గా సూర్య ఇచ్చిన ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లాయి. ఈ క్యామియో ఉన్న కేవలం కొన్ని నిమిషాలే అయినా సూర్య హావభావాలకు, విలనిజానికి అభిమానులు ఫిదా అయిపోయారు. పూర్తిస్థాయిలో రోలెక్స్​ సార్​గా చూసేందుకు అభిమానులు వెయిట్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూర్య మరో క్యామియో చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్​మీడియా వేదికగా ప్రకటించారు.

తన సినిమాలోనే: సూర్య క్యామియో చేస్తున్న మాట నిజమే కానీ రోలెక్స్​గా కాదు. తాను నటించిన చిత్రం హిందీ రిమేక్​లో ఈ క్యామియో ఉండనుంది. ఆకాశమే నీ హద్దురా చిత్రం గుర్తుందా? ఓటీటీలో రిలీజై సూపర్​హిట్​ అందుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమానే హిందీలో అక్షయ్​ కుమార్​ హీరోగా రీమేక్​ అవుతుంది. 'సూరరయ్​ పోట్రు'కు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) దర్శకత్వం వహించిన సుధా కొంగరే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చిన్న క్యామియో చేస్తున్నారట సూర్య. మరి ఇందులో ఆయన పాత్రేంటి? ఎంత నిడివి ఉంది మొదలైన విషయాలు తెలియాలు అంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్‌ బజార్'. బి.జీవన్‌ రెడ్డి దర్శకుడు. గెహన సిప్పీ కథానాయిక. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు రవితేజ ఈ చిత్రంలోని థీమ్‌ సాంగ్‌ విడుదల చేశారు. కథానాయకుడు.. అమితాబ్‌ బచ్చన్ అభిమానిగా ఎలా మారాడో, ఎంతగా ఆరాధించాడో ఈ పాట వివరిస్తుంది. దీన్ని బట్టి ఈ సినిమాలో ఆకాశ్‌.. అమితాబ్‌ ఫ్యాన్‌గా నటించారనిపిస్తోంది. రవితేజ సైతం అమితాబ్‌ బచ్చన్‌ అభిమాననే సంగతి తెలిసిందే. 'డాన్‌శీను' చిత్రంలో రవితేజ.. అమితాబ్‌ వీరాభిమానిగా కనిపిస్తారు. మిట్టపల్లి రాసిన 'బచ్చన్‌ ఫ్యాన్‌ ఆంథమ్‌'ను మంగ్లీ ఆలపించారు. ఈ గీతానికి మదీన్‌ ఎస్‌.కె. స్వరాలందించారు. వి.ఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి, కూర్పు: అన్వర్‌ అలీ, ప్రభుదేవా. పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన ఆకాశ్‌ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా మారి, ప్రేక్షకులను మెప్పించారు.

ఇదీ చూడండి :భారీ విజువల్​ వండర్​గా రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్​

ABOUT THE AUTHOR

...view details