'ఆర్ఆర్ఆర్' విజయంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఎన్టీఆర్ 30'కి కొరటాల శివ దర్శకుడు కాగా.. ఎన్టీఆర్ 31కి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాలను అదిరిపోయే సర్ప్రైజ్లను అభిమానులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఆయా నిర్మాణ సంస్థలు.
ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు సమాచారం. పుట్టిన రోజు కానుకగా.. అభిమానుల కోసం ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జూన్లో ఎన్టీఆర్ 30, అక్టోబర్లో ఎన్టీఆర్ 31 చిత్రాలు సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్లో ఎన్టీఆర్ చెప్పారు.