తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Suriya Upcoming Movies : కాలేజీ కుర్రాడిలా సూర్య.. - సూర్య తెలుగు సినిమాలు

Suriya Upcoming Movies : హీరో సూర్య - సుధా కొంగరతో చేస్తున్న కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో సూర్య చేయబోతున్న పాత్ర గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతున్నాయి.

Suriya Upcoming Movies
Suriya Upcoming Movies

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 9:57 PM IST

Suriya Upcoming Movies : తెలుగు, తమిళం​లోనూ మంచి క్రేజ్​ ఉన్న హీరో సూర్య.. ప్రస్తుతం పాన్​ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న 'కంగువా' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం సుధా కొంగరతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చేశాయి. ఈ సినిమాలో సూర్య ప్రాతకు సంబంధించి విషయాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతున్నాయి. ఈ చిత్రంలో సూర్య కాలేజీ కుర్రాడిలాగా కనిపించి ప్రేక్షకులకు కనివిందు చేయనున్నారుని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం మొత్తాన్ని నడిపించేది ఆ కీలక పాత్రే అని టాక్ నడుస్తోంది.

'ఆకాశమే నీ హద్దురా'​ లాంటి బిగ్​ సక్సెస్​ తర్వాత ఈ కాంబినేషన్​లో వస్తున్న సినిమా కావటం వల్ల ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో దుల్కర్​ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్​పై నిర్మించున్నారు. మ్యూజిక్​ డైరక్టర్​గా జీవి ప్రకాశ్​ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఈ సినిమాను విడదుల చేసేలా చిత్రం బృందం ప్లాన్​ చేస్తున్నారు. కాలేజీ కుర్రాడిలా.. ఈ పాత్రే కీ రోల్​ కావటం వల్ల సూర్య ఏ రేంజ్​లో నటిస్తాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Suriya Kanguva Movie..ఇకపోతేదర్శకుడు శివకాంబినేషనల్​లో తెరకెక్కితున్న 'కంగువా' చిత్రంలో సూర్య ఓ యోధుడులా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కథానాయికగా బాలీవుడ్ నటి దిశా పటానీ యువరాణి పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్​తో కలిసి యూవీ క్రియేషన్స్​ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024లో ఈ సినిమాను పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన పార్ట్​2, 3లు సిద్ధంగా ఉన్నాయి. పార్ట్ 1 విజయం ఆధారంగా మిగిలిన వాటిని తెరక్కెకించే ప్లాన్​లో చిత్ర బృందం ఉంది. చూడాలి మరి మొదటి భాగం ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో...

టాలీవుడ్​లో కోలీవుడ్ ధమాకా.. షాకింగ్​ బిజినెస్​.. ఈ సినిమాలు వసూళ్ల మోత మోగిస్తున్నాయిగా!

Suriya Rolex Movie : 'రోలెక్స్‌' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఈ సారి అస్సలు ఊహించని రేంజ్​లో

ABOUT THE AUTHOR

...view details