తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ తమిళ హీరో కోసం తినకుండా రాత్రంతా ప్రభాస్ వెయిట్​ చేశారట! - prabhas latest movies

తమిళ స్టార్‌ హీరో సూర్య కోసం ఓ రోజు తినకుండా రాత్రంతా ఎదురుచూశారంట ప్రభాస్​. ఈ విషయాన్ని సూర్య స్వయంగా చెప్పారు. అసలేం జరిగిందంటే?

Suriya Prabhas
Suriya Prabhas

By

Published : Nov 30, 2022, 1:15 PM IST

Suriya Prabhas: తమిళనటుడు అయినా టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గొప్పతనాన్ని సూర్య వివరించారు.
"నేను సినిమా షూటింగ్‌ కోసం ఓసారి హైదరాబాద్‌ వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌ నన్ను డిన్నర్‌కు పిలిచాడు. సాయంత్రం 6కు వస్తానని చెప్పా. కానీ నాకు షూటింగ్‌లోనే రాత్రి 11 దాటింది. ప్రభాస్‌కు సారీ చెప్పి తర్వాత కలుద్దామని చెబుదామనుకున్నాను. రాత్రి 11.30కు హోటల్‌లో ప్రభాస్‌ను కలిశాను. హోటల్‌ డిన్నర్‌ లేదా ప్రొడక్షన్‌ హౌస్‌ మెస్‌ నుంచో భోజనం తెప్పిస్తారేమో అనుకున్నా."

"కానీ తను ఇంటి నుంచి వాళ్ల అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నాకు ఇంకా ఆశ్చర్యమేసిన విషయం ఏమిటంటే నేను వచ్చే వరకు ప్రభాస్‌ నాకోసం భోజనం చేయకుండా ఎదురుచూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీని ఎప్పుడూ తినలేదు" అంటూ ప్రభాస్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌'లో, ఓం రౌత్‌ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్‌'లో నటిస్తున్నారు. వీటితో పాటు 'ప్రాజెక్ట్‌ కె' తో అలరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details