SURIYA LATEST MOVIE UPDATE: తమిళ స్టార్ సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న మూవీ షూటింగ్‌కు సిద్ధం కానుంది. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆలస్యమైంది. రెండేళ్ల క్రితమే మేకర్స్ ఈ చిత్రం గురించి అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎదురు చూపులు ఇంకా పెరిగాయి.
'సూర్య 42' వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ సూర్యతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాల మాట. పైగా ఈ సినిమాకి సీక్వెల్ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ జంట కలిసి పనిచేయడం ఇదే మొదటిసారేం కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితం వాళ్లిద్దరు ఒక యాడ్‌లో పని చేశారు. ఒకప్పటి సెల్యులార్ కంపెనీ ఎయిర్‌సెల్ కోసం కలిసి పని చేశారు. మళ్లీ ఇప్పుడు 'సూర్య 42'తో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
స్టూడియో గ్రీన్, కే.ఈ. సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జ్ఞానవేల్‌రాజా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొత్తానికి సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సినిమా సెట్స్‌లోకి రానుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశాకు ఇది తొలి తమిళ చిత్రం కావడం మరో విశేషం. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.