తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కంగువా' సెట్స్​లో ప్రమాదం - హీరో సూర్యకు గాయం - హీరో సూర్యకు ప్రమాదం

Suriya Kanguva Movie : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్​లో చిన్న ప్రమాదం జరిగింది. అందులో సూర్య గాయపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Suriya Kanguva Movie
Suriya Kanguva Movie

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 1:48 PM IST

Updated : Nov 23, 2023, 3:03 PM IST

Suriya Kanguva Movie : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువా' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో విడుదల కానున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సెట్స్​లో ఓ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో భారీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై ఓ రోప్‌ కెమెరా వచ్చి పడంది. దీంతో ఆయన భుజానికి గాయమైంది.

ఇది గమనించిన మూవీ టీమ్​.. వెంటనే షూటింగ్‌ ఆపేసి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఆ కెమెరా సూర్య భుజానికి తగలడం వల్ల త్రుటిలో భారీ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారట. అయితే ఈ ప్రమాదం గురించి మూవీ టీమ్​ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

Suriya Kanguva Movie Cast : ఇక 'కంగువా' సినిమా విషయానికొస్తే.. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్​లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్​, టీజర్ మూవీ లవర్స్​లో భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది.

మరోవైపు ఈ సివిమాలో సూర్యతో పాటు దిశా పటాని, జగపతిబాబు, కోవై సరళ, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్​ స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Kanguva Movie Suriya Look :ఈ సినిమా టీజర్​లో సూర్య లుక్​ నెటిజన్లను ఆకర్షించింది. సినీ వర్గాల సమచారం ప్రకంరా.. సూర్య ఈ చిత్రంలో ఏకంగా ఆరు డిఫరెంట్​ లుక్స్​లో కనిపించనున్నారట. అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్​లో కూడా ఉండనుందని సమాచారం. ఇక 'కంగువా' మూడు భాగాలుగా రానుందని టాక్ కూడా నడుస్తోంది.

'కంగువా' నుంచి క్రేజీ అప్డేట్​- ఏకంగా 38 భాషల్లో రిలీజ్‌!

ఈ లిటిల్ మాస్టర్ ఎవరో గుర్తుపట్టండి - ఇప్పుడు సౌత్​లో స్టార్ హీరో!

Last Updated : Nov 23, 2023, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details