తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ డబ్బింగ్​ ఆర్టిస్ట్​ మృతి.. ఆ ఇద్దరు స్టార్​ హీరోలకు మాత్రమే మిస్​ - ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి మృతి

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Dubbing artist Srinivasa murthy died
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ కన్నుమూత

By

Published : Jan 27, 2023, 12:01 PM IST

Updated : Jan 27, 2023, 3:03 PM IST

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి మృతి చెందారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో ఏళ్ల నుంచి సినీ రంగానికి సేవలు అందిస్తున్నారు. సూర్య, అజిత్‌, మోహన్‌లాల్‌, కార్తి‌, విక్రమ్‌తోపాటు పలువురు స్టార్‌ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. కేవలం రజనీకాంత్​, కమల్​హాసన్​కు మాత్రమే ఆయన చెప్పలేదు. సహాయనటుడిగానూ ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక మూర్తి విషయానికొస్తే.. బేస్ వాయిస్‌తో ఆయన చెప్పే ప్రతీ డైలాగ్ ఆయా హీరోలకు బాగా సూటయ్యేలా ఉంటాయి. ముఖ్యంగా సూర్య నటించిన 'సింగం' సిరీస్ హీరో పాత్రకు శ్రీవివాస మూర్తి అందించిన గలాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సినిమాలన్నీ చూశాక.. సూర్యకు వేరే వాళ్లు డబ్బింగ్ చెబితే అస్సలు వినలాని ఉండదు. అంతలా ప్రేక్షకులు ఆ వాయిస్​కు కనెక్టయ్యారు ​. ఏ పాత్రకు ఎటువంటి వాయిస్‌ మాడ్యులేషన్​ ఇవ్వాలో అలా ఆయన వాయిస్​ను సెట్​ చేసుకునేవారు శ్రీనివాస్​.

దాదాపు వెయ్యి పైగా చిత్రాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి, ముఖ్యంగా తెలుగులోకి అందించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. షారుక్​, సల్మాన్ వంటి సూపర్ స్టార్‌లకు సైతం శ్రీనివాస్​ డబ్బింగ్​ చెప్పారు. ఈ క్రమంలో 1998లో రాజశేఖర్​ నటించిన 'శివయ్య'కు ఆయన డబ్బింగ్​ చెప్పగా.. దానికి ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డును అందుకున్నారు. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్​ను కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి మృతి

ఇదీ చూడండి:సిల్వర్​స్క్రీన్ సత్యభామ 'జమున' అపురూప చిత్రమాలిక

Last Updated : Jan 27, 2023, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details