Surender Reddy Upcoming Movies : ఏజెంట్ చిత్రంతో కెరీర్లో భారీ డిజాస్టర్ అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా కోసం పూజ కార్యక్రమాలతో ఓ ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేశారు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన లైనప్ మారిందట. పవన్ కళ్యాణ్‌తో సినిమా కన్నా ముందు మరో స్టార్ హీరోతో మూవీ చేసేందుకు రెడీ అయనట్లు సమాచారం అందింది.
ఇంతకీ ఆ హీరో ఎవరంటే?... పవన్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన పూర్తి చేయాల్సిన చిత్రాల జాబితా కూడా పెద్దగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు, ఓజీ... ఇలా వరుసగా ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల తర్వాతే పూర్తి కానున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పుడు సురేందర్ తన లైనప్‌ను మార్చుకున్నారట. విక్టరీ వెంకటేశ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. పవన్ తన సినిమాలన్నీ పూర్తి చేసేలోగా... సురేందర్ వెంకీతో సినిమా కంప్లీట్ చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయట. వెంకటేశ్ మార్క్.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దనున్నారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించనున్నారట.
ఇకపోతే వెంకటేశ్ కూడా గత కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ముందుకెళ్తున్నారు. 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3' చిత్రాల విజయాలతో ఆయన జోరు మీదున్నారు. త్వరలోనే 'సైంధవ్' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. దీని తర్వాత ఆయన ఇప్పుడు సురేందర్‌తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట.