తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు నటి సురేఖా వాణి. ఇప్పుడు కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా కూతురు సుప్రితతో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. సుప్రితతో కలిసి లైఫ్‌ను సరదాగా గడుపుతూ వాటికి సంబంధించిన పోస్ట్‌లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. తామిద్దరివి హాట్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా వీడియోలు కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం సురేఖ భర్త మరణించిన విషయం తెలిసిందే. ఇక తర్వలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వాచ్చాయి. కానీ ఆమే మాత్రం ఇంతవరకు ఎవరిని రెండో వివాహం చేసుకోలేదు. కూతురు సుప్రీతతోనే కలిసి సింగిల్‌గా జీవిస్తున్నారు.
పవన్‌కల్యాణ్‌పై నటి సురేఖ బోల్డ్ కామెంట్ - పవన్‌కల్యాణ్‌కు 100 ముద్దులిస్తానన్న సురేఖా
ప్రస్తుతం సినిమాల్లో కన్నా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్న నటి సురేఖ సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో ఆమె ఓ హీరోకు వంద ముద్దులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అయితే తాజాగా సురేఖ వాణికి చెందిన ఓ పాత ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. అందులో ఆమె మెగాకుటుంబంపై తనకున్న అభిమానాన్ని తెలిపింది. చిరంజీవికి తాను అభిమాని అని, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతేకాదు పవన్ ఎదురుగా కనిపిస్తే వెంటనే 100 ముద్దులు ఇస్తాను అంటూ బోల్డ్ కామెంట్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రెండో పెళ్లికి తాను దూరం అని చెప్పింది. కానీ బాయ్ ఫ్రెండ్ కావాలంటూ.. కొన్ని క్వాలిటీస్‌ను కూడా చెప్పింది.
ఇదీ చూడండి: రెండో పెళ్లిపై నటి సురేఖ క్లారిటీ.. అలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ..