తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇటు మెగాస్టార్.. అటు సూపర్​స్టార్.. ఇద్దరూ వచ్చేది అప్పుడే​ - rajinikanth jailer 169th film

సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమా షూటింగ్​లో బిజీగా గడుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్​ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్​ చేశారు. అంతే కాకుండా ఓ అప్డేట్​ను మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. అదేంటంటే...

rajini jailer, chiranjevi bhola shankar
rajini jailer, chiranjevi bhola shankar

By

Published : May 4, 2023, 10:42 PM IST

బీస్ట్​ ఫేమ్​ డైరెక్టర్ నెల్సన్ దిలీప్​ కుమార్​, సూపర్​స్టార్​ రజినీకాంత్​ల కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం జైలర్. ​ఇది రజినీకాంత్ 169వ సినిమా. కాగా జైలర్​ ఆగస్టు 10 నుంచి థియేటర్లలో సందడి చేయనుందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రిలీజ్​ డేట్​ అనౌన్స్​మెంట్​ ట్యాగ్​తో 47 సెకన్ల వీడియో గ్లింప్స్​ను విడుదల చేశారు.

కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ స్టార్​ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గ్లింప్స్ వీడియోలోనూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​తో అనిరుధ్ అదరగొట్టాడు. ఇక రజినీకాంత్​ సరసన తమన్నా భాటియా హీరోయిన్​గా నటిస్తోంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, కమెడియన్ సునీల్​ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్. నిర్మల్ ఎడిటింగ్, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇకపోతే తాజాగా రిలీజైన గ్లింప్స్​ వీడియోలో సూపర్​ స్టార్​ రజినీ తన ఎంట్రీతో అదరగొట్టారు. తనదైన స్టైల్‌లో కారు నుంచి దిగుతూ కనిపించారు. బ్లూ షర్ట్​, కళ్లజోడుతో రజినీ లుక్స్​ అదిరిపోయాయంటూ సోషల్​ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో వింటేజ్ రజినీని చూశాం అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అలాగే ఈ చిన్న గ్లింప్స్‌లోనే కన్నడ హీరో రాజ్ కుమార్, మలయాళ స్టార్​ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్‌తో పాటు సునీల్​ క్యారెక్టర్‌ను చూపించారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ బెనిఫిట్‌ను పొందేలా రిలీజ్​ డేట్​ను ప్లాన్​ చేసినట్లు తెలుస్తోంది.

అదే ఆగస్టు నెలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్​ కాంబినేషనల్​లో వస్తున్న 'భోళా శంకర్' విడుదల కానుంది. మే డే రోజున కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్​ ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ పోస్టర్​లో చిరు స్టైలిష్​ టాక్సీ డ్రైవర్​గా కనిపిస్తున్నారు. 'జైలర్'​ సినిమా విడుదలైన మరుసటి రోజే చిరంజీవి సినిమా రిలీజ్​ కానుంది. ఈ చిత్రంలోనూ తమన్నా భాటియానే కథానాయిక. చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్​, కోలీవుడ్​ సూపర్‌స్టార్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్​లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇండిపెండెన్స్​ డే ఫైట్​లో ఎవరు పైచేయి సాధిస్తారో అని అటు తమిళ, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details