తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆచార్య'లో మహేశ్‌ కూడా.. థ్యాంక్స్​ చెబుతూ చిరు ట్వీట్‌ - mahesh babu role in acharya

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్​బాబుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి, మెగాపవర్​స్టార్ రామ్​ చరణ్. చిరు-చెర్రీ కాంబినేషన్​లో వస్తున్న 'ఆచార్య' సినిమాకు మహేశ్​ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు వారు స్పష్టంచేశారు. మహేశ్ గళంతో సినిమా మరింత ప్రత్యేకంగా మారనుందని మెగా హీరోలు పేర్కొన్నారు.

chiranjeevi ram charan movie
mahesh babu chiranjeevi

By

Published : Apr 22, 2022, 10:48 AM IST

Updated : Apr 22, 2022, 12:17 PM IST

Mahesh Babu: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటించిన 'ఆచార్య'లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేశ్‌ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో పలువురు అభిమానులు, నెటిజన్లు.. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్‌, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. కాగా, అభిమానుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులపై తాజాగా చిరు స్పందించారు.

"డియర్‌ మహేశ్‌.. 'ఆచార్య'లోని పాదఘట్టాన్ని నీ వాయిస్‌ ఓవర్‌తో అందరికీ పరిచయం చేయనున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్‌ విని నేనూ, చరణ్‌ ఎంతలా థ్రిల్‌ అయ్యామో.. అదేవిధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు" అని చిరు ట్వీట్‌ చేశారు.

ఇక, 'ఆచార్య' విషయానికి వస్తే కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం 'ధర్మస్థలి' పేరుతో ఓ భారీ సెట్‌ని క్రియేట్‌ చేశారు. పూజా హెగ్డే, కాజల్‌ కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్‌ 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆచార్య'కు యు/ఏ సర్టిఫికేట్
ఏప్రిల్ 23న 'ఆచార్య' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో చిరు,చెర్రీ చేతుల మీదుగా 'శ్రీదేవి శోభన్​బాబు' ట్రైలర్

ఇదీ చూడండి:మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి

Last Updated : Apr 22, 2022, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details