తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​ నన్ను స్టూడియో మొత్తం పరిగెత్తించాడు: సూపర్​స్టార్ కృష్ణ - సూపర్​స్టార్​ కృష్ణ స్పెషల్​ ప్రోమో

'స్పెషల్​ ఇంటర్వ్యూ విత్​ మై సూపర్​స్టార్​ నాన్న' అంటూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు సూపర్​స్టార్​ కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని. అందులో తన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, మహేశ్​ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికరమైన విషయాలను కృష్ణ చెప్పారు. దాన్ని మీరు చూసేయండి...

Superstar Krishna mahesh babu
సూపర్ స్టార్ కృష్ణ మహేశ్​బాబు

By

Published : May 28, 2022, 8:24 PM IST

సూపర్​స్టార్​ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. మరో రెండు రోజుల్లో(మే 31) ఆయన పుట్టినరోజు రానుంది.

ఈ సందర్భంగా కృష్ణ పెద్ద కూతురు మంజుల ఘట్టమనేని.. సూపర్​ స్టార్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇచ్చారు. స్పెషల్​ ఇంటర్వ్యూ విత్​ మై సూపర్​స్టార్​ నాన్న అంటూ ఓ ప్రోమోను రిలీజ్​ చేశారు. ఇందులో తన సినీరంగం ప్రవేశం ఎలా జరిగింది, హీరోగా ఎలా అయ్యారు, మహేశ్​ను సినిమాల్లోకి ఎలా తీసుకువచ్చారు వంటి ఆసక్తికరమైన విషయాలను కృష్ణ చెప్పారు.

మహేశ్ గురించి మాట్లాడుతూ.. "ఓ రోజు షూటింగ్​ చూస్తానని స్టూడియోకు వచ్చాడు. షూటింగ్​ జరుగుతుంటే దూరం నుంచి చూస్తూ నిలబడ్డాడు. దగ్గరికి పిలిచి ఓ సారి యాక్ట్​ చేయమని అడిగితే చేయను చేయను అంటూ స్టూడియో మొత్తం పరిగెత్తించాడు" అంటూ తెలిపారు. 'పోకిరి', 'దూకుడు' సినిమాలు మహేశ్​కు లాండ్ మార్క్​ అయ్యాయని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మే 31న రిలీజ్ కానుంది.

ఇదీ చూడండి: యువ నటీమణుల సూసైడ్​ కేసులో ట్విస్ట్​.. ఆ ఇద్దరు లెస్బియన్స్?

ABOUT THE AUTHOR

...view details