క్రిటికల్‌గా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స - ఆస్పత్రిలో సూపర్‌స్టార్ కృష్ణ
10:35 November 14
Superstar Krishna
అనారోగ్య కారణాల వల్ల కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్న స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుఝామున మహేశ్ భార్య నమ్రత గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి చేర్పించారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. స్వల్ప గుండెపోటు కూడా వచ్చినట్లు సమాచారం. సీపీఆర్ కూడా చేశారట. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే కృష్ణ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కృష్ణ ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తేనే కానీ చెప్పలేమని చెప్పారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ఱ కుటుంబంలో ఇటీవలే వరుసగా రెండు విషాదాలు చోటు చేసుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు, భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి:బన్నీ మూవీలో నటించా.. డబ్బులు ఎగ్గొట్టారు!: వకీల్‌సాబ్ సూపర్ ఉమెన్ ఎమోషనల్