తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సూపర్​స్టార్ కృష్ణ.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు.. అవార్డులు

సినిమాల్లో సాహసం చేయడం వేరు.. సినిమా పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించేందుకు సాహసించడం వేరు. అలాంటి సాహసాలెన్నో చేసి 'అసాధ్యుడు' అని అనిపించుకున్నారు సూపర్​స్టార్​ కృష్ణ. అయితే కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అభిమానులను సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలో ఆయన సాధించిన రికార్డులు అందుకున్న ఘనతలు ఓ సారి లుక్కేద్దాం.

superstar Krishna Awards and Records
సూపర్​స్టార్ కృష్ణ.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో రికార్డులు.. అవార్డులు

By

Published : Nov 15, 2022, 10:12 AM IST

Updated : Nov 15, 2022, 10:25 AM IST

కృష్ణ అవార్డులు

  • 1967: మద్రాసు ఫిలింఫాన్స్ వారితో ఉత్తమ చిత్రంగా సాక్షి, ఉత్తమ సహాయనటుడుగా అవార్డు
  • 1972: పండంటి కాపురం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎన్నిక
  • 1972: ప్రజానాయకుడు ఏపీ ప్రభుత్వంతో ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డు
  • 1972: పండంటి కాపురం చిత్రానికి ఫిలింఫేర్, ఆంధ్రపత్రిక, మద్రాస్ ఫిలింఫాన్స్ ఉత్తమ చిత్రం అవార్డు
  • 1972: పండంటి కాపురం చిత్రానికి ఏపీ ఫిలింఫాన్స్, ఆంధ్రా సినీగోయర్స్‌తో ఉత్తమ చిత్రం అవార్డు
  • 1975: 'అల్లూరి సీతారామరాజు'కు రాష్ట్ర ప్రభుత్వం బంగారు నంది అవార్డు
  • 1976: నటశేఖర బిరుదు ప్రదానం చేసిన కేంద్ర కార్మికమంత్రి రఘునాథరెడ్డి
  • 1981: 'సితార' అవార్డుల్లో ఉత్తమ కథానాయకుడిగా అంతంకాదిది ఆరంభం చిత్రానికి అవార్డు
  • 1983: 'జ్యోతిచిత్ర'వారు నిర్వహించిన సూపర్ స్టార్ బ్యాలెట్లో ఐదేళ్లు సూపర్ స్టార్ ఏకగ్రీవ ఎన్నిక
  • 1991: చిత్తూరు నాగయ్య స్మారక అవార్డు బహుకరణ
  • 1991: విజయకృష్ణ ఆర్ట్‌ థియేటర్స్ వారిచే 'రాజీవ్ రత్న' అవార్డు
  • 1993: పచ్చని సంసారం చిత్రానికి లలిత కళాంజలి, మెగా ఫిలింసిటీ ఉత్తమ నటుడి అవార్డు
  • 2002: 'ఫిల్మ్ ఫేర్' లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు
  • 2003: దాసరి కల్చరల్ అకాడమీ వారి లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు
  • 2005: ఎన్టీఆర్‌ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు, ఏఎన్నార్‌ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు
  • 2007: ముంబయిలోని స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు
  • 2008 జనవరి 16న ఆంధ్రా యూనివర్సిటీ వారి 'కళాప్రపూర్ణ డాక్టరేట్'
  • 2008 నవంబర్ 8న ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు
  • 2009 మార్చి 31న కేంద్రప్రభుత్వం వారి ప్రతిష్టాత్మకమైన 'పద్మభూషణ్' అవార్డు

కృష్ణ రికార్డులు

  • సుమారు 350కు పైగా సినిమాల్లో నటించిన మొదటి హీరో కృష్ణ
  • 1983లో విజయవాడలో శతదినోత్సవం జరుపుకున్న 6 చిత్రాలు
  • తమిళంలోకి డబ్ అయిన కృష్ణ సినిమాలు 20
  • హిందీలోకి డబ్ అయిన కృష్ణ సినిమాలు 10
  • 16 సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ
  • 1972లో కృష్ణ అత్యధికంగా నటించిన 18 సినిమాలు విడుదల
  • సూపర్‌స్టార్‌ కృష్ణతో నటించిన మల్టీస్టారర్లు 50
  • కె.ఎస్‌.ఆర్.దాసు దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమాలు 31
  • నటశేఖర కృష్ణతో కలిసి పనిచేసిన దర్శకులు 105
  • కృష్ణతో పనిచేసిన సంగీత దర్శకులు 52
  • 1965 నుంచి 2009 వరకు 44 ఏళ్లపాటు గ్యాప్ లేకుండా నటించిన ఏకైక హీరో
  • 44 ఏళ్లలో సంక్రాంతి రోజు రిలీజైన కృష్ణ సినిమాలు 30
  • కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన సింహాసనం విడుదలైన థియేటర్లు 153
  • కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 50
  • కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 43
  • కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు 31
  • సూపర్‌స్టార్‌ కృష్ణతో నటించిన హీరోయిన్ల సంఖ్య 80
  • కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు 25
  • కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 7
  • సూపర్‌స్టార్‌ కృష్ణకు 2500కు పైగా అభిమాన సంఘాలు

ఇదీ చూడండి:కృష్ణ చనిపోవడానికి అసలు కారణం ఇదే.. స్పష్టతనిచ్చిన వైద్యులు

Last Updated : Nov 15, 2022, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details