Super Star Rajinikanth Birthday :కేవలం స్టైల్, స్వాగ్తోనే బాక్సాఫీసు ముందు కాసుల వర్షం కురిపిస్తారాయన. చిన్న మేనరిజానికే ఈలలు, గోలలతో మైమరిచిపోతారు ప్రేక్షకులు. ఆరడగుల అందగాడు కాదు, ఆరు పలకల దేహం లేదు, అదిరిపోయే డ్యాన్సులు చేయలేడు కానీ ఆ రూపానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయనెవరో కాదు మన సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రజనీ పుట్టిన రోజు మంగళవారం(డిసెంబరు 12). ఈ సందర్భంగా ఆయన అసమాన సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.
అపురూప శిల్పంలా మారిన శిల
Rajinikanth Birthday Date :రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొని తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.
'అంతులేని కథ'తో ఆరంభం..!
తొలి సినిమా తర్వాత కన్నడలో 'కథా సంగమ' అనే చిత్రం చేశారు. మళ్లీ బాలచందర్ దర్శకత్వంలోనే 'అంతులేని కథ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో 'మూడ్రు ముడిచు' అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అయితే రజనీ మొదట్లో విలన్ పాత్రల్లో భయపెట్టారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. అలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆరంభంలో విలన్‌గా
ఆరంభంలో విలన్‌గా భయపెట్టి..1977లో రజనీకాంత్ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే చేశారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.
తెలుగులోనూ మెప్పించిన రజనీ
Super Star Rajinikanth Telugu Movie List : రజనీకాంత్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. 2. ఓ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించింది.