టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా తారగానే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఎంతో మంది చిన్నారులకు అండగా ఉన్నారు. చాలా మంది పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడారు. ఇలా సేవలు చేయడానికి ఓ ఫౌండేషన్ కూడా స్థాపించారు. కాగా, కొత్త సంవత్సరంలో అలాంటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ ఫౌండేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. అయితే ఈ వెబ్సైట్ లాంచ్‌లో భాగంగా మహేశ్ కుమార్తె సితారతో ఓ స్పెషల్ వీడియో చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మహేశ్ బాబు ఫౌండేషన్.
పాకెట్ మనీ డొనేట్ చేసిన సితార.. సమాజ సేవ విషయంలో తండ్రి దారిలోనే.. - మహేశ్ బాబు ఫౌండేషన్ వెబ్సైట్ లాంచ్ సితార
సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సమాజ సేవలో ముందుంటున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించారు. ఈ కొత్త సంవత్సరం మరో అడుగు ముందుకేసి.. మహేశ్ బాబు ఫౌండేషన్ వెబ్సైట్ ప్రారంభించారు. ఈ మేరకు తన కుమార్తెతో ఓ వీడియో విడుదల చేశారు.
'పిల్లలు సంతోషంగా ఉండేందుకు ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే మేము మా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాము' అని రాసుకొచ్చింది. దానికి 'ఫర్ ది చిల్డ్రెన్.. టు ది చిల్డ్రెన్' అని క్యాప్షన్ జోడించింది. కాగా, ఫౌండేషన్‌కు తన పాకెట్ మనీ ఇస్తున్నట్లు తెలిపింది మహేశ్ ముద్దుల కుమార్తె సితార.
"మా ఫ్యామిలీ ఫౌండేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా నాన్న స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషన్‌లో నేను పాలు పంచుకోవాలనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. అందుకు ఈ నెల నా పాకెట్ మనీని మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు డొనేట్ చేస్తున్నా. మీరు కూడా మీ వంతు విరాళం ఇవ్వండి. మనందరం కలిసి.. పిల్లలు సంతోషంగా నివసించేందుకు ఈ ప్రపంచాన్ని ఓ మంచి ప్రాంతంగా మార్చుదాం" అని సితార పిలుపునిచ్చింది.