టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. చెనైలోని ఆయన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగింది. కాగా ఈయన తెలుగులో స్టువర్ట్ పురం, అమ్మదొంగ లాంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనకు..దర్శకులు వి.వి.వినాయక్, శ్రీను వైట్ల, రవికుమార్ చౌదరిలు శిష్యులు.
'అమ్మ దొంగ' మూవీ డైరెక్టర్ సాగర్ కన్నుమూత - అమ్మ దొంగ మూవీ డైరక్టర్ సాగర్ సినిమాలు
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సాగర్ గురువారం చెన్నైలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామంలో 1952లో మార్చి 1న విద్యాసాగర్ జన్మించారు. సాగర్ వాళ్ల నాన్న నాగిరెడ్డి ఊరికి మున్సబుగా పనిచేస్తుండే వారు. ఎడిటింగ్ మీద ఆసక్తితో సినిమాలోకి ప్రవేశించిన సాగర్ 'రాకాసి లోయ' చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత స్టూవర్టుపురం దొంగలు తీశారు. 1997లో 'ఓసి నా మరదలా', 1999లో 'రామసక్కనోడు' చిత్రాలు తీశారు.
ఆ తర్వాత 1995 లో 'అమ్మదొంగ' సినిమా తీసి మరో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. 2002లో 'అన్వేషణ' సినిమా తీశారు. ఆ తర్వాత అదే ఏడాదిలో 'యాక్షన్ నంబర్ వన్' 'ఖైదీ బ్రదర్స్' సినిమాలు తీశారు. సాగర్ మృతిపట్ల సంతాపం తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.