Sunny Deol Villa Auction : బాలీవుడ్ నటుడుసన్నీ దేఓల్కు ఓ సమస్య వచ్చి పడింది. తమ వద్ద తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా.. ముంబయి జుహు ప్రాంతంలోని అతడి విల్లాను వేలంలో ఉంచనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కాగా ఈ వేలాన్ని సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
నటుడు సన్నీ దేఓల్కు ముంబయి జుహు ప్రాంతంలో ఖరీదైన విల్లా ఉంది. కొంత కాలం కిందట సన్నీ.. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ సహా ఈ విల్లాను గ్యారంటర్లుగా చూపి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్ల రుణం పొందారు. అయితే ఈ అప్పుకు సన్నీ వడ్డీ చెల్లించకపోగా.. బ్యాంకు వారికి స్పందించనట్లు తెలుస్తోంది. దీంతో సంబంధింత బ్యాంకు ఆదివారం అతడి విల్లాను వేలంలో ఉంచనున్నట్లు ప్రకటన చేసింది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనాలనుకునే వారు డిపాజిట్ రూపంలో రూ. 5.14 కోట్లు చెల్లించాలని బ్యాంకు పేర్కొంది. కాగా ఈ వేలాన్ని సెప్టెంబర్ 25న నిర్వహించనున్నట్లు బ్యాంక్ వర్గాలు ప్రకటనలో స్పష్టం చేశాయి.
Gadar 2 Cast :నటుడు సన్నీ దేఓల్కు చాలా కాలంగా సరైన హిట్ సినిమా లేదు. ఈ క్రమంలో ఆయన లీడ్ రోల్లో నటించిన 'గదర్ 2' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. దర్శకుడు అనిల్ శర్మ.. 2001లో రిలీజైన 'గదర్ ఏక్ ప్రేమ్ కహానీ' సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. మిథున్, మోంటీ శర్మ ఇద్దరు సంగీతం అందిచగా.. నజీబ్ ఖాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా కమల్ ముఖుత్తో కలిసి అనిల్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.