తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sunil Kollywood Movie Chances : ఫుల్ స్వింగ్​లో సునీల్ కెరీర్.. పాన్​ సౌత్ యాక్టర్​గా​​ వరుస ఆఫర్లతో.. - కమెడియన్ సునీల్ కోలీవుడ్ లో బిజీ

Sunil Kollywood Movie Chances : సీనియర్ నటుడు సునీల్​ ప్రస్తుతం కెరీర్​లో జోరు చూపిస్తున్నారు. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. పాన్ సౌత్​ యాక్టర్​గా మారిపోయారు. ఆ సంగతులు..

Sunil Kollywood Movie Chances : ఫుల్ స్వింగ్​లో సునీల్ కెరీర్.. పాన్​ సౌత్ యాక్టర్​గా​​ వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ..
Sunil Kollywood Movie Chances : ఫుల్ స్వింగ్​లో సునీల్ కెరీర్.. పాన్​ సౌత్ యాక్టర్​గా​​ వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ..

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 11:39 AM IST

Sunil Kollywood Movie Chances : కమెడియన్ సునీల్​.. ఇది ఒకప్పుడు కానీ.. ఇప్పుడు విలక్షన నటుడు అనేలా తన ట్యాగ్​ లైన్​ మార్చుకుని కెరీర్​లో వరుస ఆఫర్లలో దూసుకెళ్తున్నారు. ఆయన సినీ జ‌ర్నీ ఎలా మొదలైంది, ఎలా సాగుతుందో దాదాపుగా ప్రతీ తెలుగు సినీ ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. క‌మెడియ‌న్​గా కెరీర్ పీక్​ స్టేజ్​లో ఉన్నప్పుడు.. హాస్య పాత్రలకు గుడ్​బై చెప్పి.. హీరోగా మారారు. వరుసగా హీరోగా నటించే ఛాన్స్​లు రావడంతో అలానే కెరీర్​ను కొనసాగించారు.

అయితే 'అందాల రాముడు', 'మర్యాదరామన్న', 'పూల రంగడు' చిత్రాలతో మంచి సెక్సెస్​ అందుకున్న ఆయన.. ఆ తర్వాత కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాప్​లు ఆయన కెరీర్​ను కిందకి లాగేశాయి. హాస్యనటుడిగా ఎంత స‌క్సెస్ అయ్యారో.. హీరోగా అన్ని ఫెయిల్యూర్స్​ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఓ దశలో అటు హీరోగా ఛాన్స్​లు అందుకోలేక.. ఇటు మళ్లీ తన మార్క్​ కామెడీ పాత్రలను ఒప్పుకోలేక కాస్త ఇబ్బందే పడ్డారు.

ఇక ఫైనల్​గా​ మళ్లీ యూటర్న్​ తీసుకున్న ఆయన.. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా రాణించారు. ఈ జర్నీలో విలక్షణ నటుడిగా ఎదిగారు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. త్వరగానే కుదురుకున్నారు. కీలక పాత్రలు పోషిస్తూ​, ముఖ్యంగా ప్రతినాయక పాత్రలను చేస్తూ మళ్లీ టాప్​ పొజిషన్​కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సౌత్ ఇండస్ట్రీలోని ఇతర భాషల నుంచి ఆఫర్స్ వెలువెత్తాయి. ముఖ్యంగా కోలీవుడ్​ నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. సునీల్​ కూడా లుక్స్​, గెటప్​ విషయంలోనూ వేరియేషన్స్​ చూపిస్తూ నటన చేస్తున్నారు. జైలర్​, మావీరన్​, మార్క్ ఆంటోని వంటి చిత్రాలు చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. ఆయన నటనకు, లుక్స్​కు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా ఆయన.. కార్తి జపాన్ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో కూడా సనీల్ పాత్ర డిఫరెంట్​గా ఉంటుందని అంటున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే కోలీవుడ్ ఇండస్ట్రీ​ ఆయనకు మంచి స్టార్​డమ్​ను తీసుకొచ్చిందనే చెప్పాలి! ​ రెమ్యునరేషన్​ కూడా బాగానే పెరిగిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడాయన పుష్ప 2 చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర, నటన బలంగా ఉంటే.. పూర్తి పాన్ ఇండియా యాక్టర్​గా మారిపోవడం పక్కా. మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటించే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతానికైతే.. రీజనల్​ యాక్టర్​ బౌండరీలను బ్రేక్ చేసుకుని.. పాన్ సౌత్ యాక్టర్​గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన కార్తి జపాన్​, అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు ఈగాయ్​, రామ్​ చరణ్ గేమ్​ ఛేంజర్​, మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు.

Comedian Sunil Tamil movie offers : సునీల్ వెంటపడుతున్న కోలీవుడ్ బ్యాచ్​.. వామ్మో ఎన్ని సినిమాలు చేస్తున్నారో?

ABOUT THE AUTHOR

...view details