Suma Jayamma panchayati trailer: బుల్లి తెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కలివారపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్లో జయమ్మగా సుమ లుక్స్, నటన, సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
పవన్ చేతుల మీదగా 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్ రిలీజ్ - జయమ్మ పంచాయతీ ట్రైలర్
Suma Jayamma panchayati trailer: యాంకర్ సుమ నటించిన 'జయమ్మ పంచాయితీ' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ దీన్ని రిలీజ్ చేశారు.
'రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది' అని చెప్పడంతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ.. అనారోగ్యంతో ఉన్న తన భర్తను కాపాడుకునేందుకు.. గ్రామ పంచాయతీ ముందు తన సమస్యను లేవనెత్తుతుంది. అయితే అప్పటికే ఏదో సమస్యను ఎదుర్కొంటున్న గ్రామం.. ఆమె సమస్యను పక్కనపెడుంది. ఈ క్రమంలోనే తన సమస్యను పరిష్కరించడానికి బలమైన నిర్ణయం తీసుకున్న జయమ్మ.. ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఆ పోరాటం గ్రామంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకి జయమ్మ సమస్యకు పరిష్కారం దొరికిందా? అనేది తెలియాలంటే విలేజ్ డ్రామాగా తెరకెక్కిన 'జయమ్మ పంచాయతీ' సినిమా చూడాల్సిందే. దీంతో పాటే ఒక పూజారి, అతని ప్రేయసి మధ్య జరిగే ప్రేమకథ.. ఒక టీనేజ్ అబ్బాయి-అమ్మాయి మధ్య స్నేహం వంటివి కూడా ఈ ప్రచార చిత్రంలో చూపించారు. మొత్తంగా బలగ ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఇదీ చూడండి: 'కేజీఎఫ్ 3' ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ!