తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప2' కోసం రామోజీ ఫిల్మ్​ సిటీలో భారీ సెట్!​.. బాహుబలి ఐడియాను ఫాలో అవుతున్నారా? - pushpa 2 movie big set

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప-2'కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలో రామోజీ ఫిల్మ్​సిటీ లోపల జరగబోయే షూటింగ్‌ కోసం బాహుబలి తరహాలో ఓ భారీ సెట్‌ ఏర్పాటు చేశారని సమాచారం.

pushpa
pushpa

By

Published : Nov 3, 2022, 6:01 PM IST

Updated : Nov 3, 2022, 7:50 PM IST

Pushpa 2 Bahubali Set Plan: ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప-2'. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప- ది రైజ్‌' మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో రికార్డులు సృష్టించింది. ఇక అల్లుఅర్జున్ తనదైన శైలిలో అలరించి ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచారు. దీంతో పుష్ప2పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలు అందుకునేలా పుష్ప ది రూల్‌ని తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

నవంబర్‌ రెండో వారం నుంచి రామోజీ ఫిల్మ్​ సిటీలో షూటింగ్‌ జరుగుతుందని చిత్రబృందం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌ కోసం ఫిల్మ్​సిటీ లోపల బాహుబలి తరహాలో ఓ భారీ సెట్‌ ఏర్పాటు చేశారంటున్నారు. అక్కడ ఒక షెడ్యూల్‌ పూర్తిచేశాక విదేశాలకు వెళ్లనున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు పుష్ప సినిమా మరో బాహుబలి కానుందని తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప ది రైజ్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించిన అల్లుఅర్జున్ పుష్ప ది రూల్‌లో ఎలా ఉంటాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల పుష్ప సినిమాటోగ్రాఫర్‌ మిరోస్లా కూబా బ్రొజెక్‌ 'సాహసం ప్రారంభమైంది..' అంటూ అల్లుఅర్జున్‌ లేటెస్ట్‌ ఫొటో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Nov 3, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details