సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ అండ్ లక్‌తో పైకి వచ్చిన నటీనటులు చాలా మందే ఉంటారు. అలాంటి వారిలో హీరో సుహాస్ ఒకరు. సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ప్రస్తుతం సిల్వర్‌స్క్రీన్‌పై నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రస్తుతం భిన్న పాత్రలు పోషించే స్థాయికి ఎదుగుతున్నారు. హీరోగా కలర్ ఫోటోతో ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ను అందుకున్నారు. రీసెంట్గా రైటర్ పద్మభూషన్‌తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. స్టార్ హీరోలు సైతం ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అయితే ఇక విషయానికొస్తే.. కలర్ ఫోటో సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డును అందుకుంది. స్టార్ నటులు లేకపోయినా, కొత్త దర్శకుడే అయినా కథలో బలం ఉంటే విజయం వరిస్తుందని నిరూపించింది. ఎంతోమంది సినీ ఔత్సాహికులకు నమ్మకాన్నిచ్చింది. ఈ చిత్రంతో నటుడు సుహాస్-దర్శకుడు సందీప్ రాజ్ ఇద్దరూ ఒకేసారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కాంబో మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. సందీప్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.