తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రతన్​ టాటా బయోపిక్'పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నారంటే! - రతన్​ టాటా బయోపిక్​ సినిమా సుధా కొంగర

సూర్య హీరోగా నటించిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'తో దర్శకురాలు సుధా కొంగర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్​ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్​ టాటా బయోపిక్​ తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా సుధా కొంగర స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..

ratan tata biopic movie
ratan tata biopic movie

By

Published : Dec 4, 2022, 3:43 PM IST

'ఆకాశమే నీ హద్దురా'తో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధా కొంగర. ప్రస్తుతం ఆమె అక్షయ్‌కుమార్‌తో ఇదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమె త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారని ఇటీవల పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయా వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని చెప్పారు. "రతన్‌ టాటాకు నేను వీరాభిమానిని. ఆయన బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా తదుపరి సినిమా గురించి మీరు చూపిస్తోన్న ఆసక్తికి ధన్యవాదాలు. త్వరలోనే నా సినిమా వివరాలు ప్రకటిస్తా" అని ఆమె చెప్పుకొచ్చారు.

సూర్య కథానాయకుడిగా ఆమె తెరకెక్కించిన 'ఆకాశమే నీ హద్దురా' కూడా ఓ బయోపిక్‌గా రూపొందింది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించారు. బయోపిక్‌లను నిర్మించడంలో సుధాకు సాటి లేరని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె నుంచి రతన్‌టాటా బయోపిక్‌ వస్తుందనే వార్తలు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details