టాలీవుడ్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేశ్ పెళ్లిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. నరేష్ భార్య రమ్య.. బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టి.. పవిత్రా లోకేశ్‌తో తన భర్త వ్యవహారంపై మాట్లాడింది. ఇది జరిగిన కొద్దిసేపటికే.. పవిత్రా లోకేశ్ భర్త సుచేంద్ర ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవిత్రా లోకేశ్‌కు కాపురాలు కూల్చటం అలవాటేనన్నారు. అందుకనే తనను వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బెంగళూరులో నరేశ్ భార్య ప్రెస్‌మీట్
నరేశ్- పవిత్రా లోకేశ్‌ల గురించి ఇటీవల మీడియాలో వరుస వార్తలు వచ్చిన నేపథ్యంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి స్పందించారు. కర్ణాటకలో ఆమె మీడియాతో మాట్లాడారు. ''నరేశ్‌తో నాకు సత్సంబంధాలు లేవు. నాకు ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు. మ్యారేజ్ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ ఆయనకు మ్యారేజ్ అయితే నా పరిస్థితి ఏంటి? తాజాగా ప్రెస్‌మీట్‌లోనే 'పవిత్ర నా భార్య' అని నరేశ్ అన్నారు. పవిత్రతో పెళ్లైంది కాబట్టే ఆయన అలా అన్నారు. నరేశ్ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మూడేళ్ల నుంచి మా మధ్య విభేదాలున్నాయి. న్యాయపరంగా విడాకులు తీసుకోవడమనేది చాలా పెద్ద ప్రక్రియ. అందుకు సమయం పడుతుంది. ఈ ఏడాది జనవరిలోనే నరేశ్ నాపై కేసు పెట్టారు. అప్పుడు నేను ఇంట్లో ఉన్నా. నోటీసులు నా వరకు రాకుండా గేటు దగ్గర నుంచే వెనక్కి పంపారు. దేవుడి దయ వల్ల జూన్‌లో పోస్టు మాస్టర్ నా నంబర్‌కు కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు సమన్లు అన్నీ బెంగళూరు అడ్రస్‌కు పంపమని కోరా. నాకు పంపిన సమన్లపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. త్వరలో దీనిపై స్పందిస్తా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది'' అని రమ్య రఘుపతి అన్నారు.