AR Rahman street canada: భారత దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
కెనడాలోని మారఖమ్ నగరంలో ఒక వీధికి రెహమాన్ పేరు పెట్టారు. తన పేరు పెట్టిన మారఖమ్ నగరానికి, అక్కడి మేయర్ ఫ్రాంక్ స్కార్‌పిట్టికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుందని తన జీవితంలో ఎప్పుడూ ఉహించలేదని సంగీత రెహ్మాన్ దర్శకుడు చెప్పారు. 'రెహ్మాన్' అంటే దయగల అనే అర్థం ఉందని చెప్పిన ఆయన.. కెనడా ప్రజలకు శాంతి, సౌభాగ్యం, సంతోషం కలగాలని అభిలషించారు. తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.