విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2', 'ఆర్‌సీ 15' రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. వీటిలో ఏదో ఒక సినిమా వచ్చే సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందట. ప్రస్తుతం కమల్ 'ఇండియన్ 2' షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై వెన్నెల కిశోర్ క్లారిటీ ఇచ్చారు.
ఒక నెటిజన్.. కమెడియన్ వెన్నెల కిశోర్‌తో 'భయ్యా మీరు 'ఇండియన్ 2'లో ఉన్నారా?' అని ట్విట్టర్‌లో అడిగాడు. వెన్నెల కిషోర్ ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తూ తనదైన స్టైల్‌లో కామెడీగా రిప్లై ఇచ్చారు. 'ఇండియన్ 2 లో లేను పాకిస్థాన్ 3 లో లేను' అని తెలిపారు. ఇక సినిమాలో ఆరు నుంచి ఏడగురు విలన్లు ఉంటరని మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు.