Star Actress Childhood Photo Story : సినిమా హీరోయిన్ అంటే.. స్కిన్ షో చేయాల్సిందే అన్నది మెజారిటీ అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. కానీ.. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే.. సావిత్రి(Actress Savitri), సౌందర్య(Actress Soundarya) వంటి తారలు మదిలో మెదులుతారు. ఈ జాబితాలో.. మరో భామ కూడా చేరుతుంది. ఆమె మరెవరోకాదు.. తెలుగుతోపాటు సౌత్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ.
Actress Sneha Childhood Photo News :పై ఫొటోలో.. చూడ చక్కగా కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు.. స్టార్ యాక్ట్రెస్ స్నేహ. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో గోపించంద్ నటించిన 'తొలివలపు' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. అయితే.. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ.. రెండో చిత్రంలో హీరో తరుణ్(Actor Tharun)కు జోడిగా 'ప్రియమైన నీకు' సినిమాలో నటించింది. ఈ మూవీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పట్నుంచి స్నేహ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఆ హీరోయిన్ నవ్వుకు స్టేట్ అవార్డు
ఎక్కువగా క్లాస్ సినిమాల్లో మాత్రమే స్నేహ నటించింది. ఫ్యామిలీ, లవ్ వంటి కథలను ఎంచుకొని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సరసన నటించి సౌత్‌లో స్టార్ హీరోయిన్గా నిలిచింది. హనుమాన్ జంక్షన్’, ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’, ‘రాధా గోపాలం’, ‘వెంకీ’ లాంటి పలు చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తెలుగు అమ్మాయే..!