ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన చిత్రం వారసుడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తెలుగులో ఈ సినిమా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. కాగా, తమిళ్లో యథావిధిగా జనవరి 11న విడుదల చేయనున్నామని చెప్పింది.
ఒక్క అడుగు వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు రిలీజ్ వాయిదా.. కొత్త తేదీ ఇదే.. - వారసుడు సినిమా ట్రైలర్
స్టార్ నిర్మాత దిల్ రాజు ఓ అడుగు వెనక్కి వేశారు. వారసుడు చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొత్త విడుదల తేదీని తెలిపారు.
అయితే థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్‌రాజు తెలిపారు. "సంక్రాంతికి విడుదలవుతున్న దిగ్గజ కథానాయకులు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందుకే నేను ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాను. అందరూ బాగుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరూ నా మీద ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి" అని దిల్‌రాజు చెప్పారు. హిట్ సినిమా ఎప్పుడూ రిలీజ్ చేసినా హిట్టే అవుతుందని ఆయన అన్నారు. సినిమా తెలుగు ప్రమోషన్స్‌కు త్వరలో హీరో విజయ్ హైదరాబాద్‌కు వస్తారని తెలిపారు. తమిళ్ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకులు రజినీకాంత్, సూర్య, ధనుష్, కమల్‌హాసన్ లాంటి వారితో భవిష్యత్‌లో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు.